నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే ఊర్వశి రౌటేలా సహా శ్రద్దా శ్రీనాథ్ లు కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి కాగా ఈ సినిమా థియేటర్స్ తర్వాత రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చేసింది.
అయితే ఈ చిత్రం హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇందులో డాకు మహారాజ్ అనూహ్య రెస్పాన్స్ ని అందుకుంది. భారీ వ్యూస్ తో మాత్రమే కాకుండా ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో కూడా ట్రెండింగ్ కి ఈ చిత్రం వెంటనే వచ్చింది.
ఇక ఇదే ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో ఇప్పటికీ కొనసాగిస్తూ ఇతర సినిమాల్ని మించి ఈ సినిమా డామినేష్ చేస్తూ కొనసాగడం విశేషం. దీనితో ఓటిటిలో మాత్రం డాకు ఎఫెక్ట్ గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.