అఖండ 2 కోసం బాలయ్య బాబు అంత తీసుకున్నాడా! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఆయన నటించే చిత్రాలు వరుస విజయాల్ని అందుకోవడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నారు.
ఇక ఆయన నటించిన గత కొన్ని చిత్రాలను గమనిస్తే, మనకు ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ కారణంగానే ఆయన రీసెంట్‌గా థమన్‌కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ బహుమతిని బాలయ్య తన నెక్స్ట్ మూవీ ‘అఖండ 2’ చిత్ర రెమ్యునరేషన్ నుంచి ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 కోసం బాలయ్య తన రెమ్యునరేషన్‌ను రూ.28 కోట్ల నుంచి ఏకంగా రూ.7 కోట్ల మేర పెంచి రూ.35 కోట్లుగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ పెంచిన రెమ్యునరేషన్ నుంచే ఆయన థమన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.