అఖండ-2’లో బజరంగీ భాయిజాన్ ముద్దుగుమ్మ!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అఖండ 2 – తాండవం’ అనే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పక్కర్లేదు. బాలయ్య – బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మీద మొదటి భాగం వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలే ఉన్నాయి. ‘అఖండ’ సినిమాతో అందరికీ ఫుల్ మాస్ హంగామా ఇచ్చిన ఈ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే సమాచారం వచ్చింది. ఆయన్ను ఈసారి మరింత పవర్‌ఫుల్ లుక్‌లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో తాజా సర్‌ప్రైజ్ ఎంట్రీగా బాలీవుడ్ చిత్రంగా నిలిచిన ‘బజరంగీ భాయిజాన్’లో మున్నీగా గుర్తింపు తెచ్చుకున్న హర్షాలి మల్హోత్రా కూడా నటిస్తున్న సంగతి బయటకు వచ్చింది. ‘జనని’ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌ వల్ల ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, థమన్ అందిస్తున్న సంగీతం కూడా సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ స్పీడ్‌ పెంచిన చిత్ర బృందం, ప్రమోషనల్ యాక్టివిటీలతో కూడా బిజీగా మారుతోంది. బాలయ్య అభిమానులకు, మాస్ ఆడియెన్స్‌ కూడా ఈ సినిమాపై చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories