ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీ రీలీజ్ సినిమాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నది బాహుబలి ది ఎపిక్. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ రెండు భాగాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా థియేటర్లలో మళ్లీ చూపించేందుకు మేకర్స్ సిద్దమయ్యారు.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా, అనుష్క, రానా, తమన్నా వంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌ను మరోసారి పెద్ద తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మహా చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా పలు ఫార్మాట్లలో విడుదల కానుంది — అంటే ఆడియెన్స్‌కి అనుభవం మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది.
ఇక టికెట్ ధరలపై వస్తున్న సందేహాలకు కూడా మేకర్స్ సమాధానం ఇచ్చినట్టే సమాచారం. పెద్ద స్థాయి రీ రీలీజ్ అయినప్పటికీ, టికెట్ రేట్లు సాధారణంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. అందువల్ల అభిమానులు ఎలాంటి భారం లేకుండా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.