బాహుబలి –రీ రిలిజ్‌ -కొత్త సీన్లు కూడా!

ప్రభాస్ హీరోగా, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. అప్పట్లో ఈ రెండు భాగాలూ బాక్సాఫీసు దగ్గర ఓ రేంజ్‌లో దూసుకెళ్లి, భారత సినీ చరిత్రలో గోల్డెన్ పేజెస్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ ఎపిక్ సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఇంకా స్పెషల్ ఏమిటంటే, ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఈ రెండు సినిమాలనీ కలిపి మరోసారి థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది సాధారణమైన రీ-రిలీజ్ కాదట. రీ-ఎంట్రీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, కొత్త ట్విస్టులు కూడా ఉండొచ్చని వినిపిస్తోంది. గతంలో యూట్యూబ్ ద్వారా విడుదలైన కొన్ని డిలీట్ చేసిన సీన్స్ కి వచ్చిన స్పందన చూసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు మరికొన్ని అదనపు సీన్స్ తో బాహుబలి కథను మరో కోణంలో చూపించాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.

ఇక సినిమాల రన్ టైమ్ కూడా కొంచెం కుదించబోతున్నారని సమాచారం. ఈసారి సినిమాను మరింత వేగంగా, గ్రిప్పింగ్‌గా చూపించేలా ఎడిట్ చేసే పనులు జరుపుతున్నారట. థియేటర్ అనుభూతి మళ్లీ పండించాలనే ఉద్దేశంతోనే ఈ రీ-రిలీజ్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.

అంతా బాగుంటే, బాహుబలి రెండూ కలిపిన ఈ స్పెషల్ వెర్షన్ థియేటర్స్‌లో మరోసారి అభిమానులను ఊపేసే అవకాశం ఉంది. కొత్తగా యాడ్ చేసిన సీన్స్, కట్ చేసిన భాగాలు ఇలా మొత్తం కలిపి చూసుకుంటే.. ఇది ఒక ఎపిక్ అనుభూతి కచ్చితంగా అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories