ఇండియన్ సినిమా చరిత్రలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన “బాహుబలి” సిరీస్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి – హీరో ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ రెండు భాగాల ఎపిక్ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దాదాపు పది సంవత్సరాల తర్వాత “బాహుబలి ది ఎపిక్” పేరుతో ప్రత్యేక ఎడిషన్‌గా రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి మరో అప్‌డేట్ వచ్చింది. బాహుబలి ఇప్పుడు ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల కానుంది. దీనిని వరల్డ్ ఐమాక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఐమాక్స్ ఫార్మాట్‌లో రాబోవడం వల్ల ఈ రీ-రిలీజ్ మరింత భవ్యంగా, విజువల్‌గా అద్భుతంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మించారు. పాన్ ఇండియా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి ఈ ప్రత్యేక వెర్షన్ సిద్ధమవుతోంది.