పదేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి!

తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మారుస్తూ ఓ సరికొత్త ట్రెండ్‌ని ఏర్పరిచిన సినిమా బాహుబలి. భారతీయ సినిమాను చూసే దృక్పథాన్నే మార్చేసిన ఈ మాస్టర్ పీస్‌ విడుదలై ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అదే గౌరవం ఉంది. అప్పటివరకు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలే ఎక్కువగానూ మాట్లాడుకునేవారు. అలాంటి సమయంలో తెలుగులో రూపొందిన బాహుబలి అన్ని భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, మన సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది.

ఇది సాధారణంగా నిర్మించిన సినిమా కాదు. మొదట ఈ ప్రాజెక్ట్‌ని ఒకే పార్ట్‌గా తీయాలని ఆలోచించారు. కానీ కథ పొడవుతో, విషయాల డెఫ్త్ పెరిగిపోవడంతో దీన్ని రెండు భాగాలుగా విస్తరించారు. మొదట ప్లాన్ చేసిన బడ్జెట్ 150 కోట్ల వరకు ఉండగా, తర్వాత అది 250 కోట్లకు చేరుకుంది. అయితే ఈ భారీ బడ్జెట్‌ ఉన్నా, దర్శకుడు రాజమౌళి ఒక్క రూపాయి కూడా వృధా చేయకూడదనే తపనతో ప్రతి ఖర్చును జాగ్రత్తగా చూసుకున్నారు.

ఒకసారి సినిమా షూటింగ్ కోసం టీమ్‌ బయటకి వెళ్ళినప్పుడు కేవలం నటీనటులకే మంచి హోటల్స్‌లో బస కల్పించారని, మిగతా టీమ్ సింపుల్ హోటల్స్‌లో ఉండేదట. కొన్నిసార్లు బాత్రూంలు కూడా సరిగా లేని చోట్ల రాజమౌళి తానే ఉండిపోయిన సందర్భాలున్నాయట. తాను సేవ్ చేసిన డబ్బును షూటింగ్‌లో మరింత నాణ్యత కోసం వాడాలని భావించేవారట. సెట్స్‌ దగ్గర కూడా సిబ్బందికి సాధారణంగా వెజిటేరియన్ భోజనే ఇవ్వబడేదట. కేవలం కొద్ది మందికే నాన్‌వెజ్ హక్కుగా ఉండేది.

ఇక ఈ ప్రాజెక్ట్‌ హిందీలో పెద్ద స్థాయిలో రిలీజ్ కావాలంటే తప్పనిసరిగా అక్కడ ఓ స్ట్రాంగ్ కనెక్షన్ అవసరం. అప్పుడు భల్లాలదేవ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కి ఈ సినిమా చూపించి అతని ద్వారా బాహుబలిని హిందీలో రిలీజ్ చేయించాడట. ఆ నిర్ణయం తర్వాత ఈ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులలోనూ సంచలనం సృష్టించింది.

రిలీజ్ రోజు సినిమాకి వచ్చిన టాక్ చూసి మొత్తం టీమ్ కొంత కాలం షాక్‌లోనికే వెళ్లిందట. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే టెన్షన్‌తో ప్రభాస్, రాజమౌళి సహా అందరూ ఆందోళనకు లోనయ్యారట. కానీ కొన్ని రోజులు గడిచాకే సినిమా క్రమంగా పిక్‌అప్‌ అవుతూ థియేటర్లవద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నట్టు తెలిసి ఊపిరి పీల్చుకున్నారట. అంతే కాదు, సినిమా కోసం ప్రభాస్‌ తానే స్వయంగా స్టంట్స్‌ చేశాడు. తన భుజానికి గాయం అయినప్పటికీ ‘ధీవర’ పాటలో ఓ రిస్కీ సీన్‌ చేశాడు. అ డెడికేషన్‌ చూసిన టీమ్ అంతా ఆశ్చర్యపోయారట.

ఇలా ఎన్నో కష్టాలు, కటకటాల మధ్య తెరకెక్కిన బాహుబలి చివరకు రెండు భాగాలుగా విడుదలై ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా మాత్రమే కాదు, అది తెచ్చిన మార్పే భారతీయ సినిమాకి ఆస్కార్ వరకూ దారి తీసిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories