బచ్చల మల్లి…అచ్చు అల్లు అర్జున్‌ లెక్కే!

అల్లరి నరేష్‌ అంటేనే కామెడీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పుకొవచ్చు. ఏ సినిమా తీసినా కడుపుబ్బా నవ్వించే కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల కాస్త రూటు మార్చి మరింత ఆకట్టుకునే విధంగా సరికొత్త చిత్రాలతో  వచ్చి హిట్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లరోడు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న మరో సినిమా ‘బచ్చల మల్లి’తో మన ముందుకు రాబోతోంది.

సుబ్బు మంగాదేవి డైరెక్షన్‌లో హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, గుత్తా బాలాజీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్  వేగంగా జరుగుతోంది. ఇకపోతే బచ్చల మల్లి మూవీ నుంచి ఇప్పటికే అల్లరి నరేష్ మాస్ లుక్‌లో కనిపించే పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తూ.. ‘పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్’ అనే క్యాప్షన్‌తో హీరో క్యారెక్టర్ గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.

అయితే జూన్ 30న అల్లరి నరేష్ పుట్టినరోజు ఉన్నందున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఇదే విషయంపై క్లారిటీ ఇస్తూ తాజాగా బచ్చల మల్లి సినిమా నుంచి మరోసారి అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అయితే ఇందులో అల్లరి నరేష్ లుక్ కాస్త.. అల్లు అర్జున్ లెక్క కనిపిస్తుండటంతో మొదట చూడగానే ‘బన్నీ పుష్ప లెక్క కనిపిస్తున్నాడేంటి?’ అని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు!

Related Posts

Comments

spot_img

Recent Stories