తెలుగు ఓటిటి కంటెంట్ లో మంచి హిట్ అయిన పలు సిరీస్ లలో ఈటీవీ విన్ లో వచ్చిన 90స్ బయోపిక్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మందికి మళ్ళీ పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ మంచి కామెడీతో ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. అయితే దీనికి సీజన్ 2 కోసం ఆశిస్తే మేకర్స్ ఇపుడు దానికి సీక్వెల్ ని ప్రకటించారు. అది కూడా టాలీవుడ్ ఓ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ కనుమ కానుకగా దీనిని ప్రకటించారు.
దర్శకుడు ఆదిత్య హాసన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. బేబీ సెన్సేషనల్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య కాంబోలో దీనిని ప్రకటించారు. అయితే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ప్లాన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా ఆడియెన్స్ ని అలరిస్తుందో చూడాలి.