బాబు హెచ్చరిక : చివరి ఓటు ఎంచేదాకా కదలొద్దు!

తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చూస్తుండే ఈ ఎన్నికల తరుణంలో చంద్రబాబునాయుడు తన పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి కౌంటింగ్ ఏజంట్లుగా వెళ్లేవారికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. నిజానికి అవి హెచ్చరికల్లాంటివే. కౌంటింగులో చివరి రౌండు చివరి ఓటు ఎంచడం పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి ఎవ్వరూ బయటకు రానేవద్దని ఆయన సూచించారు. ఏ క్షణంలో అయినా ఫలితాలను తారుమారు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజంట్లు కుట్రలు చేయవచ్చునని, ఆయన అందరినీ హెచ్చరించి పంపుతున్నారు.

వైసీపీకి ప్రస్తుతం గడ్డు రోజులు నడుస్తున్నాయి. అయితే పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడినట్టుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద విధ్వంసానికి పాల్పడడం, అవాంతరాలు సృష్టించడం ద్వారా గలాభా చేయాలనే వ్యూహంతోనే ఆ పార్టీ నాయకులు ఉన్నారు. పైగా అధికార్లను ప్రలోభపెట్టి లేదా బెదిరించి దాడులు చేసి అయినా సరే.. తాము అనుకున్నది సాధించుకోవడానికి వారంతా డెస్పరేట్ గా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎంత భారీ దాడులు అయినా జరగవచ్చునని తెలుగుదేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగినా సరే.. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏజంట్లు బయటకు రావొద్దని చంద్రబాబునాయుడు ముందే జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతున్నట్టుగా కౌంటింగ్ సంకేతాలు వచ్చినా సరే.. పూర్తిగా చేజారిపోయినట్టు అనిపించినా సరే.. ఏజంట్లు మాత్రం మధ్యలో బయటకు రావొద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సజ్జల రామక్రిష్ణారెడ్డి కౌంటింగ్ ఏజంట్లకు శిక్షణ ఇచ్చారు. ఆయన ఇచ్చిన సారాంశం మాత్రం ఒక్కటే.. రూల్సు ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఏం జరిగినా సరే పోరాడే తత్వం ఉన్న వాళ్లు మాత్రమే ఏజంట్లుగా వెళ్లండి.. లాంటి మాటలు చెప్పారు. దీని సారాంశం ఏమిటో అందరికీ తెలుసు. నిజానికి తెలుగుదేశం పార్టీ అతిగా జాగ్రత్తలు తీసుకోవాడానికి, తమ ఏజంట్లను అలర్ట్ చేస్తుండడానికి కూడా సజ్జల మాటలే కారణం. మరి ఇప్పటికే ఏజంట్లు లోనికి చేరుకుంటుండగా..కౌంటింగ్ పర్వం ఏం తేలుస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories