బాబు మాస్టర్ స్ట్రోక్ : జగన్ విధ్వంసానికి శాశ్వతత్వం!

జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే తన ముద్రగా పరిపాలన సాగించిన సంగతి అందరికీ తెలుసు. ఆయనలోని విధ్వంసక మనస్తత్వానికి ఒక శాశ్వత రూపం ప్రజలకు ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి సమీపంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక శిథిలాలను అక్కడి నుంచి తొలగించకుండా అలాగే ఉంచేయాలని ప్రజలను సందర్శనార్థం అనుమతించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

జగన్ గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కలెక్టర్ల సమావేశాన్ని అదే ప్రజావేదిక మీద నిర్వహించారు. ఆ మరుసటి రోజునే దానిని కూల్చివేయించారు. ఆ విధ్వంసక ప్రవృత్తే ప్రజల్లో సర్వత్రా చర్చినీయాంశం అయింది. ప్రజావేదిక చంద్రబాబు నివాసం పక్కనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు తన నివాసానికి వెళుతూ వస్తూ ఉండే ప్రతి సందర్భంలోనూ తాను నిర్మించిన ప్రజావేదిక శిధిలమై ముక్కలుగా కనిపిస్తుంటే, చూసుకుంటూ కుమిలిపోతూ ఉండాలనే శాడిస్టిక్ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ శకలాలను తొలగించలేదు.

చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రాంతం మొత్తం పర్యటన చేసినప్పుడు ప్రజావేదిక దగ్గర నుంచే ప్రారంభించారు. అమరావతి పర్యటన ముగిశాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజావేదిక శిథిలాలను అలాగే స్మారక స్థూపం లాగా వదిలేయడం గురించి కొందరు విలేకరులు ప్రస్తావించారు. జపాన్లో అణుబాంబుల దాడికి ధ్వంసమైన హిరోషిమా, నాగసాకి నగరాలను పునరుద్ధరించకుండా ఆ స్ఫూర్తితో యావత్ దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్న వైనాన్ని చంద్రబాబు నాయుడు అప్పుడు గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచేసి జగన్ విధ్వంసకతత్వానికి ప్రతీకగా వదిలేయాలని తాజాగా నిర్ణయించారు. దాని స్ఫూర్తితో అమరావతి నగరాన్ని అద్భుతంగా అద్భుతంగా నిర్మించాలని అంటున్నారు.

ప్రజలనుంచి సీఎం విజ్ఞప్తులు స్వీకరించడానికి, కలెక్టర్లతో సమావేశాలు వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించడానికి అమరావతి రాజధాని ప్రాంతంలోనే మరోచోట ప్రజావేదికను నిర్మించబోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories