ఆరోగ్యభద్రతలో బాబు వరం బ్రహ్మాస్త్రమే!

ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం శ్రద్ధ వహించడం అంటే ఏమిటో .. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు కలిసి తాజాగా విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో నిరూపిస్తున్నది. కోట్ల మంది ప్రజల యొక్క ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వం బాధ్యత వహించడంతో పాటు ప్రజలకు అద్భుతమైన వరాన్ని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులు అందరికీ అవసరమైన జనరిక్ మందులను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని అన్నారు. ప్రత్యర్థులకు దిమ్మతిరిగే హామీ ఇది. కనీసం కోటిమంది మీద సంధించిన బ్రహ్మాస్త్రం ఇది.
కేవలం అనువంశికంగా మాత్రమే కాకుండా.. ఇప్పుడు సమాజంలో బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆధునిక జీవన శైలులు, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా.. బీపీ మరియు షుగర్ వ్యాధులు చాలా చిన్నవయసులోనే వచ్చేస్తున్నాయి. మూడు పదులు కూడా నిండకుండానే ఈ వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా పెరుగుతున్నారు. నడివయసు వారైతే ఇక చెప్పే అవసరమే లేదు. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి షుగర్, బీపీ వ్యాధులు తప్పకుండా ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం అంటే అద్బుతమైన వరమే.

అదొక్కటి మాత్రమే కాదు.. ప్రజారోగ్యం గురించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ మేనిఫెస్టో ద్వారా నిరూపించుకున్నారు కూడా. ప్రతి కుటుంబానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా చేయించేందుకు కూడా తెలుగుదేశం పూనుకుంటున్నది. అలాగే ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం అని.. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యం విషయంలో కూడా తన ఎప్పటిమాదిరి అలసత్వ ధోరణినే ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రజలకు ఎలాంటి కొత్త హామీలు ఆయన ఇవ్వలేదు సరికదా.. తమ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తాం అనే స్వీపింగ్ స్టేట్మెంట్ తప్ప.. నిర్దిష్టంగా తాము చేయదలచుకున్నది ఏమిటో ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజారోగ్యం గురించి ఉన్న శ్రద్ధపై అనుమానాలు కలుగుతున్నాయని, చంద్రబాబునాయుడు ఉచితంగా మందులు పంపిణీ వంటి హామీ.. బీపీ షుగర్ రోగుల్లో జీవితం పట్ల ఒక భరోసాకు కారణం అవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories