చెత్త పాలన ఆనవాళ్లనుంచి విముక్తి ఇస్తున్న బాబు!

జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పేదలకు పథకాల పేరుతో నిధులు వారి జేబులో పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. ఇలా ఒక చేత్తో డబ్బులు ఇస్తూ, అలా మరో చేత్తో చెత్త మద్యానికి నిర్ణయించిన అధికధరలు, నిత్యావసరాల అధికధరల రూపేణా ఎడాపెడా దోచేసుకోవడం ఆయనకే చెల్లింది. అలాగే ప్రధానంగా గ్రామాలకు వెళ్లే రోడ్లు అత్యంత అధ్వానంగా గోతులు, లోయల మయంగా మారిపోయినప్పటికీ.. జగన్ ఏనాడూ వాటిని మరమ్మతు చేయడం గురించి పట్టించుకోలేదు. అలాంటిది.. ప్రజల మీద చెత్త పన్ను మాత్రం బాది ముక్కు పిండి వసూలు చేయడం ప్రారంభించారు. చెత్త పన్నులు వసూలు చేసే విషయంలో మునిసిపాలిటీల సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో చాలా అమానుషంగా వ్యవహరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. జగన్ సర్కారు విధించిన చుత్త పన్ను అనేది ఒక తుగ్లక్ నిర్ణయంగా పరిహాసాస్పదంగా మారింది. ఇప్పుడు  ఆ చెత్త పన్ను చెత్త నిర్ణయం నుంచి బాబు సర్కారు ప్రజలకు విముక్తి కల్పించారు.

కేంద్రం గతంలో ఏ గాంధీజీ జయంతి రోజున స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని ప్రారంభించారో.. అదే గాంధీ జయంతి రో జున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు స్వచ్ఛభారత్ కు పునరంకితం అవుతూనే.. రాష్ట్రంలో చెత్త పన్నును ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.

జగన్ సర్కారు చెత్త పన్ను విధించినప్పుడు గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా ప్రతి చోటా ఈ నిర్ణయం పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం తీరును ప్రజలు దుమ్మెత్తిపోశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు జరిగినప్పటికీ కూడా  జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే ఈ పన్ను ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు.

గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత.. ఒక్కటొక్కటిగా హామీలు అన్నిటినీ అమలు చేస్తున్న చంద్రబాబునాయుడు సర్కారు.. చెత్త పన్నును కూడా రద్దు చేసేసింది. సూపర్ సిక్స్ లో మిగిలి ఉన్న వాటిని కూడా దశలవారీగా అమల్లోకి తేనున్నారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లను కూడా దీపావళికి ఇస్తాం అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories