అబ్బాయి ప్లేస్ లో బాబాయి…ఎన్బీకే 109 నుంచి అదిరిపోయే మాస్‌ అప్డేట్!

నందమూరి నటసింహం బాలయ్య బాబు వరుస సినిమాల విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. పోయిన సంవత్సరం సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకి భగవంత్‌ కేసరి సినిమాలతో సూపర్‌ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టాడు బాలయ్య బాబు. యంగ్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109‘. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై  అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన బాలయ్య బాబు బర్త్ డే గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల  విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ఓ అదిరిపోయే అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.

ఏపీ లో ఎన్నికల  కారణంగా కొన్ని నెలలు ఈ సినిమా షూటింగ్‌కి విరామం ఇచ్చిన బాలకృష్ణ.. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. ఓ నెలన్నర షూటింగ్‌తో టాకీ పార్ట్‌ పూర్తవుతుందని సమచారం. దీంతో ఈ సినిమాను అక్టోబర్‌ 10న విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఇదే డేట్ కి ఎన్టీఆర్ ‘దేవర’ విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా షూటింగ్ పనులు అనుకున్న దానికంటే ముందే పూర్తవ్వడంతో సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ చేశారు. దీంతో ఆ డేట్ పై ‘NBK109’ మూవీ టీమ్ కాసుకుని కూర్చుంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories