బాబాయ్‌ ..అంటూ నారా రోహిత్‌..పోస్టు వైరల్‌!

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమాపై మంచి హైప్ నెలకొంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది.

ఈ వేడుకలో మంచు మనోజ్ భావోద్వేగంతో మాట్లాడిన తీరు అభిమానులను, సినీ జనాలను ఆకట్టుకుంది. ఆయన మాటలు చాలామందిని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ఆ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడిన తీరుకు సంబంధించి నారా రోహిత్ కూడా స్పందించాడు. తాజాగా రోహిత్ తన సోషల్ మీడియా ద్వారా మనోజ్‌పై ఎమోషనల్‌గా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఈవెంట్ విజయవంతం కావడంలో అభిమానులు, ఏలూరు ప్రజల పాత్ర ఎంతో ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు మనోజ్ మాట్లాడిన మాటలు తనను బాగా ప్రేరేపించాయని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాను అతని వెంటనే ఉంటానని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న బంధం అటు వ్యక్తిగతంగా, ఇటు సినిమాల్లోనూ ఎలా ఉందో ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.

ఈ ముగ్గురు నటీనటులు కలిసి చేసిన భైరవం సినిమా మే 30న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూస్తే, సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories