నాని సినిమాలో బాహుబలి హీరోయిన్‌!

తాజాగానే నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన  సాలిడ్ హిట్ సినిమా “సరిపోదా శనివారం”.ఈ సినిమాతో  తాను హ్యాట్రిక్ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన నుంచి మరింత స్ట్రాంగ్ లైనప్ వస్తుండగా ఈ లైనప్ లో దసరా సినిమా డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న భారీ సినిమా “ప్యారడైజ్”.

మరి దీనిపై అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ సెట్టవ్వగా ఇపుడు శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.అయితే ఈ సినిమాలో బాహుబలి నటి రమ్యకృష్ణ ఓ మంచి పాత్రలో కనిపించనున్నట్టుగా సమాచారం. రమ్యకృష్ణ ఈ సినిమాలో నానికి తల్లి పాత్ర పోషించనున్నట్టుగా టాక్ వినపడుతుంది.

మరి ఈ సినిమాలో తన రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా నాని సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “హిట్ 3” సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను తీర్చిదిద్దుతున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories