ఆయుధ పూజ సాంగ్ కి టైం ఫిక్స్ అయ్యిందోచ్‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా,  జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఆమెతో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సినిమా దేవర. ఈ సినిమాని మాస్‌ యాక్షన్ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

 ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ తాలూకా మ్యూజిక్ ఆల్బమ్ కూడా మంచి హిట్ అందుకుంది. అయితే ఈ ఆల్బమ్ లో ఎప్పుడు నుంచో ఊరిస్తున్న క్రేజీ నెంబర్ ఆయుధ పూజపై ఫైనల్ గా మేకర్స్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. మరి ఈ సాంగ్ ని రేపు సెప్టెంబర్ 19న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా తారక్ పై ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న పోస్టర్ తో క్లారిటి ఇచ్చారు.

దీంతో ఈ సాంగ్ కోసం ఇపుడు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ని అనిరుద్ ఏ లెవెల్లో అందించాడో అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా “దేవర” భారీగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories