జగనన్నకు క్లారిటీ ఇచ్చేసిన అయ్యన్న!

జగన్మోహన్ రెడ్డి ఇక కోర్టు ద్వారా పోరాటాన్ని నమ్ముకోవాల్సిందే. లేదా, తనకు అన్యాయం చేశారంటూ.. ప్రజలందరూ నవ్వుకునే విధంగా వారి ఎదుటకు వెళ్లి.. ప్రభుత్వం మీద జాలిగొలిపే విలాపాలు వినిపించాల్సిందే. అంతకు మించి ఆయనకు ఇప్పుడే వేరే ప్రత్యామ్నాయం లేదు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాతో కేబినెట్ ర్యాంకు కావాలని ఆరాటపడుతున్న జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ఆ కోరిక తీరవచ్చునేమో అనే ఆశలు ఏమూలనైనా ఉండిఉంటే వాటిమీద స్పీకరు అయ్యన్నపాత్రుడు నీళ్లు చిలకరించేశారు. ‘జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే’ అని స్పీకరు అయ్యన్నపాత్రుడు స్పష్టీకరించారు.

నిజం చెప్పాలంటే తాను సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, రాష్ట్ర ప్రజలు తనకు సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అయిదేళ్లపాటు పనిచేయాల్సిందిగా తీర్పు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే.. ప్రభుత్వం మీద బురద చల్లడానికి నత్యం ఏదో ఒక నెపం వెతుక్కుంటూ జీవించాలి గనుక.. ఆయన దీనిని కూడా ఒక పెద్ద విషయంలాగా చేయడానికి ప్రయత్నించారు. పదిశాతం ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్షహోదా ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదని, కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ స్పీకరుకు లేఖ రాశారు. ఇదే విషయం మీద హైకోర్టులో కేసు కూడా నడుపుతున్నారు.

ఇదేు జగన్మోహన్ రెడ్డి గతంలో  ముఖ్యమంత్రిగా ఉంటూ.. 23 సీట్లు గెలిచిన తెలుగుదేశం నుంచి కొందరు ఫిరాయించిన తర్వాత.. మరో ముగ్గురిని లాగేసుకుంటే మీ నాయకుడికి ప్రతిపక్షహోదా పోతుంది అని ఎద్దేవా చేసిన సంగతి ఆయనకు తప్పకుండా గుర్తుంటుంది. ప్రభుత్వాన్ని నిందించడానికి తన వాదన బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిపక్షహోదా కోసం కోర్టులో కూడా వేశారు.

అయితే ఆయన కోరిక పట్ల మాత్రం ప్రజలు నవ్వుకుంటున్నారు. కోర్టులో ఆయన తన వాదన నిజమేనని.. రాజ్యాంగంలో దేశంలోని ఇతర చట్టసభల నిర్వహణలో అలాంటి నిబంధన లేదని నిరూపించుకుంటే.. ఆ తర్వాత కోర్టు ఏమైనా పరిశీలిస్తుందేమో గానీ.. స్పీకరు ద్వారా ఆయన కోరిక నెరవేరే చాన్సు లేనట్టే. స్వయంగా అయ్యన్నపాత్రుడే.. ‘జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే’ అని అంటున్నారు. ఆయన శాసనసభకు వచ్చి మాట్లాడాలని.. ఎగ్గొట్టడం కరెక్టు కాదని అంటున్నారు.

ఇంతకు ఆ హోదా కోసం ఓడిపోయిన జగన్ కు అంత పట్టుదల ఎందుకు? ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా ఉంటే.. ఏదైనా కేసుల్లో అరెస్టు చేయాల్పి వస్తే గవర్నరు అనుమతిత అవసరం అని.. దానికోసమే జగన్ ఆరాటం అని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories