టాలీవుడ్లో వచ్చిన సినిమాలకు టాక్ బాగున్నా, దానికి తగ్గ ఆదరణ మాత్రం కనిపించడం లేదు. కొన్ని సినిమాల్లో ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కారణాలుగా చెబుతున్నారు.ఆడియన్స్ థియేటర్లకు వస్తేనే సినిమాలు విజయం అందుకుంటుందని వారు చెబుతున్నారు.
అయితే, తాజాగా ఈ అంశంపై నేచురల్ స్టార్ నాని కూడా పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘హిట్-3’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని తెలుగు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు అనేది పూర్తిగా తప్పు అని.. వారిని థియేటర్లకు వచ్చేలా మనమే సినిమాల ద్వారా ప్రేరేపించాలని నాని అన్నారు. ఒక సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడితే, ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో దానిని చూస్తారు అని నాని అన్నాడు.
మరి నాని చేసిన ఈ కామెంట్స్‌తో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం. ఇక నాని హిట్-3 మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.