తన మనుషులపై దాడి:మోడీ గుస్సా అవుతారా?

మరో 48 గంటల వ్యవధి కంటె తక్కువలోనే అక్కడ ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభనిర్వహించి.. తన పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ఆ వ్యవధిలోనే ఆయన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో ఉన్న కీలక అభ్యర్థి మీద ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడిచేసి కొట్టారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే! పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని వాహనం తరలిస్తున్న సమయంలోనే వైసీపీ గూండాలు దాడికి దిగి కొట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో అర్థం చేసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీకి ఇంతకంటె పెద్ద ఉదాహరణ అవసరం పడకపోవచ్చు. కనీసం ఇప్పటికైనా నరేంద్రమోడీ రాష్ట్రంలో పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. జగన్ ప్రభుత్వపు దుర్మార్గాల మీద దందాల మీద నిప్పులు చెరగుతారా? అనే ప్రశ్న ప్రజల్లో ఎదురవుతోంది.

ఏపీలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని వ్యవహారం ఇది. శనివారం నాటి పరిణామాల్లో అక్కడ ప్రతి ఘటన కూడా వైసీపీ పోకడలకు నిదర్శనమే. ఆ నియోజకవర్గం పరిధిలోని తారువ గ్రామంలో కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. భాజపా కార్యకర్త గంగాధర్ అనే వ్యక్తి మీద వైసీపీ వారు దాడికి దిగారు. తమ ప్రచారాన్ని డ్రోన్ తో షూట్ చేసుకుంటూ ఉండగా.. డ్రోన్ ను వారు ధ్వంసం చేశారు. వారినికొట్టారు. నలుగురికి గాయాలయ్యాయి. ఈలోగా అక్కడకుచేరుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, బిజెపి కార్యకర్త గంగాధర్ ను చెప్పుతోకొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే వారు పట్టించుకోలేదు సరికదా.. వారినే స్టేషనుకు రమ్మన్నారు. ఈలోగా అక్కడకు భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు అసలు రమేశ్ ను గ్రామంలోనికే అనుమతించలేదు. ఆయన పట్టుపట్టడంతో.. అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వైసీపీ గూండాలు రెచ్చిపోయి సీఎం రమేశ్ మీద దాడి చేయడం జరిగింది. ఆయన చొక్కా చిరిగిపోయింది. గాయాలయ్యాయి. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు అన్నింటినీ ధ్వంసం చేశారు.

సాక్షాత్తూ పోలీసుల సాక్షిగానే ఇంత అరాచకం జరిగిపోయింది. ఇలాంటి వ్యవహారాల మీద సోమవారం సాయంత్రం అదే అనకాపల్లిలో బహిరంగ సభ నిర్వహించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. తమ పార్టీ అభ్యర్థి మీద దాడి చేయించిన జగన్పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం గురించి ప్రజలకు పిలుపు ఇస్తారా? లేదా, జగన్ అరాచకాల్ని నిలదీయకుండా బిజెపికి 400 సీట్లు ఇవ్వండి.. అనే పాట మాత్రం పాడేసి వెళ్లిపోతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories