యథా పెద్దిరెడ్డీ.. తథా సజ్జల.. కబ్జాలకు ముకుతాడు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చెలాయించిన రోజుల్లో ఆయన పార్టీకి చెందిన అనుచరగణాలందరూ రాష్ట్రమంతా రెచ్చిపోతూ ఎలాంటి దోపిడీ పర్వం నడిపించారో, అక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది.. వైఎస్ జగన్ తర్వాత అంతటి కీలక నాయకులుగా, నెంబర్ టూ లుగా అధికారం చెలాయించిన వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి. వైఎస్సార్ కాంగ్రెసులో మామూలు కార్యకర్తలే విచ్చలవిడి కబ్జాలకు పాల్పడుతూ పోగా.. ఈ నెంబర్ టూ లు ఏ స్థాయి కబ్జాలు చేసిఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి అధికార మదంతో పాల్పడిన అన్ని పాపాలను లెక్కతీస్తున్నారు.

అన్ని కబ్జాలను సవరిస్తున్నారు. అటవీ భూములు, ప్రభుత్వ భూములు అనే తేడాలు ఎంచకుండా.. తమ కన్ను పడితే చాలు.. యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడిన వీరి దందాలకు ఇప్పుడు ముకుతాడు పడుతోంది. కొన్ని రోజుల కిందటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఆక్రమించిన అటవీభూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, బోర్డులు పెట్టిన వైనం పాఠకులకు తెలుసు. అచ్చంగా అదే మాదిరిగా.. మరో నెంబర్ టూ సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆక్రమించిన అటవీ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో కేసులు సజ్జల రామక్రిష్ణారెడ్డి పై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

కడపజిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల రామక్రిష్ణా రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఎస్టేట్ 184 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మొత్తం భూమిలో 63ఎకరాలు ఆ కుటుంబం ఆక్రమించిన భూమి అని అధికారులు లెక్క తేల్చారు. అక్కడ సర్వే నెంబరు 1629 లో 11వేల ఎకరాల భూమి ఉండగా.. అందులో 63 ఎకరాలను కబ్జా చేసినట్టుగా గుర్తించారు.
ఈ 63 ఎకరాల కబ్జాలో.. 52 ఎకరాలు పూర్తిగా అటవీ భూమి అనే సంగతిని కూడా గుర్తించారు. ఈ మేరకు సర్వే లు చేపట్టిన తర్వాత.. సీకే దిన్నె తహశీల్దార్ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు హద్దులు నిర్ణయించి బోర్డులు పాతారు.

తమాషా ఏంటంటే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చిత్తూరు జిల్లాలో దందాలు సాగిస్తూ అటవీ భూములను కబ్జా చేశారు. బోరు వేయడంతోపాటు, జీవవైవిధ్యానికి హాని కలిగించారు. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. అలాంటి కబ్జాలకే సజ్జల రామక్రిషారెడ్డి కూడా పాల్పడ్డారు. ఎస్టేట్ కోసం ఆయనకు 122 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ.. అది చాలదన్నట్టు మరో 62 ఎకరాలు కబ్జా చేశారు. దానికి కాస్తా ఇప్పుడు అధికారులు చెక్ పెట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories