ఇచ్చిందిగా..గట్టిగా ఇచ్చిందిగా..!

జాతీయ నటుడు, ఐకాన్‌ స్టార్‌  అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా  ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ గా దూసుకుపోతుంది. డైరెక్టర్‌  సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఇటు సౌత్ ప్రేక్షకులతో పాటు అటు నార్త్‌లోనూ పట్టం కట్టారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు ఓ రేంజ్‌ రెస్పాన్స్ దక్కుతోంది. హిందీలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డుల క్రియేట్ చేసింది.

ఇక నార్త్‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటేత్తుతున్నారు.అయితే, ఓ థియేటర్ మాత్రం ‘పుష్ప-2’ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్‌ నే ఇచ్చింది. ‘పుష్ప-2’ సినిమాని చూసేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకుని షో టైమ్‌కి థియేటర్‌ వద్దకు వచ్చారు. అయితే, సదరు థియేటర్‌లో ‘పుష్ప-2’ సినిమాకు బదులు వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ ప్రదర్శిస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది.

దీంతో ‘పుష్ప-2’ కోసం వచ్చిన అభిమానులు థియేటర్ యాజమాన్యం పై నిప్పులు చెరిగారు.ఎలాంటి సమాచారం లేకుండా పుష్ప-2 షో ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వారు మండిపడ్డారు.  

Related Posts

Comments

spot_img

Recent Stories