తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘కంగువా’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక దీంతో తన తరువాత సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సూర్య. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తన నెక్స్ట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ హీరో.
‘రెట్రో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 1న గ్రాండ్ విడుదలకు సిద్దం చేశారు. ఇక ఈ సినిమా విడుదల కాకముందే సూర్య తన తరువాత చిత్రాన్ని కూడా సిద్దం చేస్తున్నాడు. ఆర్జె బాలాజీ డైరెక్షన్లో సూర్య తన కెరీర్‌లోని 45వ సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడని సమాచారం.
ఇలా ఒకేసారి హీరోగా, విలన్‌గా సూర్య నటించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ‘24’ చిత్రంలోనూ సూర్య ఇదే తరహా పాత్రల్లో యాక్ట్ చేశాడు. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే.