మరోసారి ప్రేక్షకుల ముందుకు ఆర్య 2!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ “పుష్ప 2”.  మరి ఈ చిత్రం దర్శకుడు సుకుమార్ తో బన్నీకి ఉన్న ట్రాక్ రికార్డు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ కలయికలో పుష్ప ఫ్రాంచైజ్ కి మించి ఆర్య ఫ్రాంచైజ్ ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలు కూడా ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రానున్న ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుండగా ఈసారి తన పుట్టినరోజుకి అభిమానులు ఆర్య 2ని రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఆర్య 2 కి ఇపుడు ఇది వరకు ఏ సినిమాకి జరగని కొత్త ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీంతో ఆర్య 2 చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రీరిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా  సమాచారం. మరి ఇది నిజమైతే ఈ ఫస్ట్ ఎవర్ స్టెప్ తీసుకున్న హీరోగా బన్నీ నిలవనున్నడని తెలుస్తుంది. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో డెఫినెట్ గా ఈ రీరిలీజ్ వర్క్ అవ్వొచ్చు అని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories