రెండు పార్టీల నేతల అరెస్టు.. ఓవరాక్షన్ మాత్రం ఒక్కరిదే!

ఎన్నికల సమయంలో పోలీసులు చాలా చాలా అప్రమత్తంగతా వ్యవహరించాలి. వారు ఏ మాత్రం మొహమాటానికి పోయినా.. తర్వాతి పర్యవసానాలకు జవాబుదారీతనం వహించాల్సింది పోలీసులే. అందుకే, తమను వ్యక్తిగతంగా ఎవరెలా విమర్శించినా పోలీసులు కొంచెం కఠినంగానే వ్యవహరిస్తుంటారు. కడప జిల్లాలో ఉప ఎన్నికల సందర్భంగా కూడా అలాగే జరిగింది. పార్టీల రాగద్వేషాలను తమకు అంటగట్టకుండా వారు రెండు పార్టీల వైపునుంచి కొందరు నాయకులను అరెస్టు చేశారు, కొందరిని గృహనిర్బంధం చేశారు. పోలీసు తమ పాత్ర తాము నిష్పాక్షికంగా నిర్వహించి.. ఇరు వర్గాల వారిని అరెస్టు చేశారు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం చాలా చాలా ఓవరాక్షన్ చేయడం గమనార్హం. అదే సమయంలో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చట్టాన్ని గౌరవించి ఉండిపోయారు. ఈ రెండు పార్టీల మధ్య అసలు వ్యత్యాసం ఇదే కదా అని ప్రజలు వైసీపీని ఈసడించుకుంటుండడం విశేషం.

కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొందరు నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందనిపించిన వారిమీద మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజుల ముందునుంచి కూడా ప్రజలను తమ పార్టీ వారిని రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. వైసీపీ నేత సతీశ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. రెండు పార్టీల నాయకుల్నీ అరెస్టు చేసినప్పటికీ.. ఆ ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటివద్ద అరెస్టు చేసిన సమయంలోనే పెద్ద హైడ్రామా నడిచింది. ఆయనను తీసుకువచ్చి జీపు ఎక్కించేందుకు ప్రయత్నిస్తే.. డీఎస్పీ, సీఐ తప్ప మరొక్క పోలీసుకూడా అందుకు సహకరించలేదు. అవినాష్ పోలీసులను ఆ రేంజిలో భయపెట్టారు. ఆయనను ఎర్రగుంట్ల తరలిస్తుండగా.. మధ్యలో పార్టీ నేతలు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. అవినాష్ రెడ్డి కూడా వారితో కలిసి రోడ్డుపై కూర్చుని కొద్దిసేపటిలోనే పోలీసుల కళ్లుగప్పి అక్కడినుంచి పరారయ్యారు. పులివెందులలో వైసీపీ కార్యాలయానికి వచ్చి చేరారు. ఆ సంగతి తెలిసిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీఅశోక్  కుమార్ లు అక్కడకు వెళ్లి ఎంపీని హెచ్చరించారు. పోలీసులనుంచి పారిపోయి మళ్లీ ఇక్కడికెలా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు స్టేషనకు రావాలని హెచ్చరించి వెళ్లారు. ఎంపీ అవినాష్ ఆమేరకు సాయంత్రం వెళ్లగా, ఆయనకు నోటీసులు ఇచ్చి పాపంరు. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఇడుపులపాయ పోలీసు స్టేషన్లో సాయంత్రం 6 గంటల వరకు ఉంచారు. అరెస్టు పట్ల నిరసన వ్యక్తం చేసినప్పటికీ.. తెదేపా నేత పోలీసులకు సహకరించడం విశేషం. ఈ రెండు అరెస్టులు- నేతల వ్యవహార సరళితోనే.. వైసీపీ వారి బుద్ధి బయటపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories