పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి గురించి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పూర్తిగా వింటేజ్ లుక్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
సినిమాను సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ను వేగంగా మొదలుపెట్టిన మేకర్స్, తాజాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రను బయటకు తీసుకువచ్చారు. అర్జున్ అనే పాత్రలో నటిస్తున్న అర్జున్ దాస్ లుక్‌ను రిలీజ్ చేశారు. బాక్సింగ్ పంచ్‌లతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆయన పోస్టర్, సినిమా మీద మరింత ఆసక్తిని పెంచుతోంది.