మీరు రెడీనా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ మూవీలోని రెండో సింగిల్ సాంగ్ ‘కొల్లగొట్టినాదిరో’ కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
రొమాంటిక్ మెలోడీ గా వచ్చిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ తనదైన వింటేజ్ స్టెప్పులతో ఇరగదీశాడు. ఇక అందాల భామ నిధి అగర్వాల్ ఈ పాటలో చాలా అందంగా కనిపించింది. కాగా తాజాగా నిధి అగర్వాల్ ఈ పాటకి రీల్ చేసి నెటిజన్లకు కూడా ఛాలెంజ్ విసిరింది. ‘కొల్లగొట్టినాదిరో హుక్ స్టెప్ వేయడం నాకు చాలా నచ్చింది. మరి ఇప్పుడు మీ వంతు వచ్చింది, నా రీల్ ఛాలెంజ్ ని స్వీకరించండి. మీ డ్యాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండి!’ అంటూ నిధి అగర్వాల్ ఛాలెంజ్ విసిరింది. మరి ఈ ఛాలెంజ్ ను నెటిజన్లు ఎలా స్వీకరిస్తారో చూడాలి.