బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాబిల్ బాలీవుడ్ తీరును ఎండగడుతూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే, బాబిల్ టీమ్ ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చింది. అతడి ఆవేదనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. ఐతే, తాజాగా బాబిల్ ఖాన్ టీమ్ ఇచ్చిన క్లారిటీపై తెలుగు దర్శకుడు సాయి రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
ఇంతకీ, సాయి రాజేష్ ఏం పోస్ట్ పెట్టారంటే.. ‘మేము ఏమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? వీడియోలో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్లు అయితే.. ఇంతకాలం అతడికి సపోర్ట్‌గా నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఒక గంట ముందు వరకూ అతడికి సపోర్ట్‌గా నిలవాలని అనుకున్నా. కానీ, మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిదనిపిస్తుంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు. మీరు నిజాయతీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అంటూ సాయి రాజేష్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.