టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ నుంచి అదిరిపోయే టీజర్‌ను మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్ టెర్రిఫిక్‌గా ఉందని అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ ‘కింగ్‌డమ్’ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ పూర్తి కాలేదట. అయితే, ఈ సినిమా డెవలప్ అవుతున్న తరుణంలో కథలోని ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి ఫస్ట్ పార్ట్ సినిమా రెడీ అయ్యిందట. ఇక కథలోని సెకండ్ హాఫ్‌ను రెండో పార్ట్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్ర స్ట్రాటెజీని ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది.
పుష్ప చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా కథ పూర్తిగా లేదు. కానీ, సినిమాను డెవలప్ చేస్తున్న కొద్ది పుష్ప కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఇక ఈ రెండు పార్ట్‌లు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మరి కింగ్‌డమ్ చిత్రాన్ని నిజంగానే రెండు పార్ట్‌లుగా తెరకెక్కించనున్నారా.. అనేది అధికారికంగా వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే.