ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమాల్లో ముందుగా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న “ఓజీ”. ఈ సినిమాతో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ కలయిక మొదటిసారి జరుగుతుండటమే కాకుండా, స్ట్రైట్ తెలుగు సినిమా కావడంతో సహజంగానే అంచనాలు చాలా ఎక్కువయ్యాయి.
ఈ ప్రాజెక్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేస్తున్న పనితనం కూడా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇటీవల బయటకు వచ్చిన మ్యూజిక్ గ్లింప్స్ చూసి అభిమానులు మరింత ఉత్సాహం చూపుతున్నారు. ఆయన అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి కొత్త లెవెల్ హైప్‌ను తెచ్చిపెడుతున్నాయి.
ఇక మేకర్స్ నుంచి ఇంకా కొన్ని సర్ప్రైజ్‌లు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ అభిమానులు మాత్రమే కాకుండా మెగా అభిమానులంతా కూడా ఈ సినిమాకి థియేటర్స్‌లో పండగ వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు.