శ్రీలీలకు నిశ్చితార్థం అయ్యిందా!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యువ కథానాయికలలో శ్రీలీల ఒకరు. ఆమె సినిమా ఫలితాలు ఎలా ఉన్నా వెనక్కి చూసే పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు సినిమా ప్రాజెక్టుల గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం నుంచి ఏదైనా మంచి వార్త వస్తుందా అనే ఆసక్తి పుట్టుకొచ్చింది.

ఇటీవల ఆమె ఇన్‌స్టా స్టోరిలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు, సోషల్ మీడియాలో అనేక మంది ఆమెకు నిశ్చితార్థం  జరిగిపోయిందని అనుకుంటున్నారు. ఆ ఫోటోలలో ఉన్న వాతావరణం, వేడుకల హడావిడి కూడా ఆ అనుమానాలకు బలాన్ని జోడించాయి. పైగా త్వరలోనే అంటూ ఇచ్చిన చిన్న హింట్ వల్ల మరీ ఎక్కువగా చర్చలు మొదలయ్యాయి.

ఇప్పుడు శ్రీలీల పెళ్లి చేస్తున్నారంటూ రూమర్లు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజంగానే ఇది ఆమె పెళ్లి వార్తేనా, లేక వేరే ఏదైనా గుడ్ న్యూసా అనే క్లారిటీ మాత్రం ఆమె నుంచే రావాల్సి ఉంది. అభిమానులు, నెటిజన్లు ఆమె నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories