సర్ది చెప్పడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పట్టు క్రమంగా కోల్పోతున్నారా? రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజం అయినప్పుడు, నిన్నటి గెలుపు తర్వాత ఇవాళ ఓటమి పలకరించింది. ఓకే కానీ, ఇక భవిష్యత్తు కూడా ఉండదేమో అని భయపడుతున్న రీతిలో చాలామంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వాటికి వారికి భరోసా కల్పించడంలో, సర్దిచెప్పి పార్టీలోనే కొనసాగేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలవుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆఫర్లు ఉండి అందుకోసం ఎగబడి లేదా అధికారం పంచన మాత్రమే ఉండదలుచుకునే వ్యక్తులు వెళ్లిపోవడం అర్థం చేసుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టేసి, ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలి అనే స్థాయిలో విరక్తితో వెళుతున్న నాయకుల పరిస్థితి చిత్రంగా కనిపిస్తోంది.

నిన్నటి వరకు జగన్ ఎంతగానో నమ్మినట్లుగా, ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిన నాయకులు కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) తాజాగా పార్టీకి రాజీనామా చేయడం ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తుంది.

ఇప్పటికే పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ ను వీడిపోయారు. ఆళ్ల నాని నాలుగో వ్యక్తిగా అనుకోవాలి. అయితే ఇదివరకటి ముగ్గురు నాయకులు పార్టీని వీడడం వేరు.. ఆళ్ల నాని పార్టీని వేయడం వేరు అన్నట్టుగా పరిగణించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు వెళ్లిపోయిన వారిలో మద్దాలి గిరి, పెండెం  దొరబాబు ఒక కేటగిరీకి చెందుతారు. వారిద్దరూ తాజా మాజీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ, ఇటీవల ఎన్నికలలో వారికి సీటు దక్కలేదు. ఏదో మొక్కుబడిగా పార్టీలో కొనసాగారు. ఓడిపోయిన తర్వాత అదే అసంతృప్తిగా వారు వెళ్ళిపోయారు అని అనుకోవచ్చు. కిలారి రోశయ్య పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రమోషన్ కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆళ్ల నాని వంతు వచ్చింది. ఆయన కూడా తాజా మాజీ ఎమ్మెల్యే నే. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి చేశారు మంత్రిగా కూడా ఆళ్ళ విస్తృతంగా తిరిగారు. అయినా సరే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు అసలు రాజకీయాలకే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా ప్రకటించి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పద్ధతితో సహా రాజీనామాలు సమర్పించి జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపడం సర్వత్రా చర్చినీయాంశం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా పార్టీ నాయకుల మీద పట్టు కోల్పోతున్నారని అందరూ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories