మరోసారి వాయిదా పడ్డ అనుష్క మూవీ!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఘాటీ గురించి కొత్త అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న అభిమానులకు మాత్రం కొద్దిగా నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ మూవీ జూలై 11న థియేటర్లలోకి రావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా స్పష్టం చేసింది. ఒక ప్రకటన ద్వారా ఈ సినిమా తమకు కేవలం సినిమా కాదని, భావోద్వేగంగా ముడిపడిన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నామని చెప్పారు. అందుకే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కేర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తుండటంతో కొంత టైం తీసుకుంటోందని తెలియజేశారు.

ఇక వాయిదాకు ప్రధాన కారణం మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తవకపోవడమే అని తెలుస్తోంది. ఈ పనులు పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఇంకా కొద్దిరోజులు వేచి చూడాల్సి ఉంది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. అనుష్క మరోసారి ఒక విభిన్నమైన కథతో వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories