అనుష్క ఘాటీ వాయిదా..!

టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ చాలా సెలెక్టివ్ గా ఉంటారు. చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే లవ్లీ డ్రామాతో కనిపించిన ఆమె, ఆ తరువాత నటిస్తున్న ప్రాజెక్ట్‌గానే ‘ఘాటీ’ అనే సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయగా, అనేక అంచనాలు మధ్య రూపొందింది. మొదట్లో ఇది థియేటర్లలో విడుదల కావాల్సింది, కానీ కొన్ని పనులు మిగిలి ఉండటం వల్ల రిలీజ్ ప్లాన్ వాయిదా పడింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, జూలై లో సినిమా రిలీజ్ కావల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇప్పటికీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని, అందుకే రిలీజ్ తేదీని కొత్తగా నిర్ణయించేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని విద్యాసాగర్ అందించగా, నిర్మాణ బాధ్యతలను యూవీ క్రియేషన్స్ తీసుకున్నారు.

ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్నది ఈ సినిమాకి తుది రిలీజ్ డేట్ ఎప్పుడని మాత్రమే. అనుష్క మళ్లీ స్క్రీన్ మీద కనిపించబోతున్నందుకు ఆమె ఫ్యాన్స్ అయితే బాగా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories