వామ్మో ఇలా ఉందేంటి!

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా  ‘పరదా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

అయితే, ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా, సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ టీజర్‌లో అనుపమ ఓ ఇంట్రెస్టింగ్ జర్నీ చేస్తున్నట్లు, ఈ జర్నీలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది మనకు ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories