వార్-2 సినిమాలో మరో సర్‌ప్రైజ్..!

బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు కొత్త మోతాదులో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండగా, ప్రస్తుతం అందరి దృష్టి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న “వార్ 2” మీదే ఉంది. ఈ సినిమా యష్ రాజ్ ఫిలింస్ సంస్థ రూపొందిస్తుండటంతో మునుపటి స్పై యాక్షన్ యూనివర్స్‌కి ఇది మరో మైలురాయిగా నిలవబోతోందనే అంచనాలు పెరిగిపోయాయి.

ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే హృతిక్, ఎన్టీఆర్ కలయికపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉండగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు సినీ వర్గాలు. సినిమా చివర్లో, టైటిల్స్ వచ్చే సమయంలో మరో ప్రాజెక్ట్‌కి సంబంధించిన కీలక సీన్‌ను చూపించబోతున్నారట.

అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “ఆల్ఫా” అనే సినిమా మొదలవుతుందనే సంకేతాన్ని “వార్ 2” ముగింపులో ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంటే ఈ సినిమాతో యశ్ రాజ్ స్పై యూనివర్స్‌కి మరో కొత్త అడుగు పడనుందని స్పష్టమవుతోంది. వార్ 2 ఎక్కడ ముగుస్తుందో అక్కడినుంచే “ఆల్ఫా” కథ ప్రారంభమయ్యేలా చిత్రీకరించారని బజ్ వినిపిస్తోంది.

ఈ సీన్‌ వింటేనే థ్రిల్ ఫీలవుతుంది కాబట్టి, థియేటర్‌లో చూసిన తరువాత ఆ అనుభూతి మరింత స్పెషల్‌గా ఉండనుంది. ఇప్పుడు అందరి మైండ్‌లోనూ “వార్ 2” తర్వాత ఏం? అనే ప్రశ్నే మారుమోగుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నదే ఆల్ఫా సీన్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ స్పై యాక్షన్ ప్రపంచం మనకు ఏసాధారణ అనుభవాన్ని ఇస్తుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు కాస్తంత ఓపికగా ఎదురుచూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories