మెగా మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటే, అది అతను చేసే ప్రమోషన్లు. ఆయన తరహాలో వచ్చే ప్రచార కార్యక్రమాలు సినిమాకే కాదు, ప్రేక్షకుల ఊహలకు కూడా మించినవే.

ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ఈ సినిమాలో ఆయన ప్రమోషన్ డోస్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తికాకముందే ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ఒక్కొక్కసారిగా సర్ప్రైజ్‌లను వెలుగు లోకి తీసుకొస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట ప్రకటించినప్పటినుంచి నయనతార పాత్రను పరిచయం చేసినంతవరకు అన్నీ అతని స్టైల్లోనే జరిగాయి.

ఇటీవల మరో ప్రత్యేకమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జీ తెలుగు ఛానెల్‌లో ఓ కార్యక్రమంలో చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కోసం రూపొందించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది మెగా అభిమానులకు మంచి గిఫ్ట్‌లా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా చిరుతో చేసిన ప్రమోషన్ ప్లాన్‌లు చూస్తే, రిలీజ్ సమయానికి ఇంకెన్ని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయో అని మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories