సలార్‌ 2 లో మరో సూపర్ స్టార్‌ హీరో!

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సలార్-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సలార్ 2లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ను సంప్రదించినట్లు టాక్‌ నడుస్తుంది.

ఈ వార్త గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభాస్, మోహన్‌లాల్ ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకునేందుకు మంచి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.  కాగా ఈ సీక్వెల్‌లో నటిస్తున్న శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్,  శ్రియా రెడ్డి మరోసారి సెట్స్ పైకి రానున్నారు.

 అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో విడుదల చేస్తామని తెలిపారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన వివరించారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories