ఏఐ యూనివర్సిటీ దిశగా మరొక అడుగు!

విశాఖపట్నం నగరాన్ని ఆధునిక సాంకేతిక పురోగతికి కేంద్ర బిందువుగా, హబ్ గా మారుస్తామనే హామీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంది. విశాఖకు ఐటి పరంగా కొత్తగా ఎన్ని సంస్థలు రానున్నాయో.. సాంకేతిక శిక్షణలపరంగా ఎలాంటి కేంద్ర బిందువుగా నగరాన్ని మార్చబోతున్నారో ప్రజలకు తెలుసు! తాజాగా విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తు మొదలైంది. ఈ దిశగా రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. దీని ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిపేందుకు నారా లోకేష్ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవతో భేటీ కావడానికి ఢిల్లీ వెళ్లారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఇచ్చిన విధ్వంస కానుక ఏమిటో అందరికీ తెలుసు. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి ఆ నగరాన్ని మహాద్భుతంగా ఉద్ధరించేస్తానన్నట్లుగా జగన్ బిల్డప్ ఇచ్చారు తప్ప, ఆ నగరానికి కూడా చేసింది ఏమీ లేదని అక్కడ ప్రజలకు తెలుసు. అందుకే గత ఏడాది ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను దారుణంగా ఓడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి ఒక్కటే అని ఎంత స్పష్టంగా చెప్పి అభివృద్ధి పనులు చేపడుతున్నారో, అంతే స్పష్టంగా విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే విశాఖపట్నం నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ మరియు ఏఐ రాజధానిగా అవతరించినా కూడా ఆశ్చర్యం లేదు.

విశాఖలో టిసిఎస్ ప్రాజెక్టు రావడానికి రంగం మొత్తం సిద్ధమైంది. దాదాపు 50 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టి సి ఎస్ తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. గూగుల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకుంది. ఇంకా అనేక ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం రావడానికి లోకేష్ చర్చల పర్వం పూర్తి చేసి ఉన్నారు. మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో లోకేష్ సాగిస్తారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న సరికొత్త ఆలోచనలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం అనేక రీతుల్లో అండదండలు అందిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో లోకేష్  సాగించే  చర్చల ఫలితాలు త్వరలోనే కార్యరూపం దాలుస్తాయిని ప్రజలు నమ్ముతున్నారు. ఏఐ యూనివర్సిటీతో పాటు మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్కేంద్రాలు కూడా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories