రాబిన్‌ హుడ్‌ నుంచి హీరో మరో లుక్‌!

టాలీవుడ్‌ నటుడు నితిన్‌ ప్రధాన పాత్రలో , వెంకీ కుడుముల డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ రాబిన్‌ హుడ్‌. ఈ చిత్రం గురించి చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్ర బృందం టైటిల్‌ తో పాటుగా రిలీజ్‌ చేసిన వీడియో ఆడియెన్స్‌ ను విశేషంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ను మూవీ మేకర్స్‌ వెల్లడించారు.

నితిన్‌ పుట్టిన రోజు సందర్భంగా శనివారం నితిన్‌ కు సంబంధించిన కొత్త లుక్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా మూవీ మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories