పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో రానున్న మూవీ ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తీర్చిదిద్దుతున్నారు అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో సీనియర్ నటి కూడా యాక్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినపడుతుంది.
కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో ముఖ్యమని పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను తీసుకుని రానున్నట్లు టాక్ నడుస్తుంది.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ ముఖ్య పాత్రలో యాక్ట్‌చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన ఫౌజీ షూట్ సెట్స్ లో జాయిన్ అయ్యారంట.