మరో జగన్ భక్త ఐపీఎస్‌పై సస్పెన్షన్ వేటు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా కొన్ని దశాబ్దాల పాటు తానే రాజ్యమేలబోతున్నాననే భ్రమల్లో బతికారు. జగన్ తన గురించి తాను ఎలాంటి భ్రమలు కలిగిఉన్నారనేది వేరే సంగతి.. కానీ.. ప్రజల్లో ఉండి పనిచేసే అధికారుల్లోని జగన్ భక్తులు కూడా.. జగన్ శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే బతికారు. అలా బతుకుతూ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతూ వచ్చారు. జగన్ రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో మరింత పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవినీతిపరులైన అలాంటి జగన్ భక్త  అధికారులకు చుక్కలు చూపిస్తోంది. వారి అవినీతిపై కఠినచర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జగన్ వీర భక్తుల్లో ఒకరైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ విభాగం చీఫ్ గా గతంలో పనిచేసిన ఎన్. సంజయ్ పై తాజాగా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన అగ్నిమాపక శాఖ డైరకెక్టర్ జనరల్ గా పనిచేసిన రోజుల్లో కోటిరూపాయలకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్టుగా.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిగ్గుతేల్చింది. దీంతో ఆయన మీద ప్రభుత్వం చర్య తీసుకుంది.

జగన జమానా ముగిసే రోజుల నాటికి సీఐడీ చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ రాజకీయ ప్రత్యర్థుల  మీదికి ఎంతగా రెచ్చిపోయి ప్రవర్తించారో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు అరెస్టు, రామోజీరావు విచారణ తదితర సందర్భాల్లో ఆయన వైఖరి సర్వత్రా విమర్శలకు గురైంది. అయితే సీఐడీచీఫ్ అయ్యేముందు ఆయన ఫైర్ సేఫ్టీలో ఉన్నారు. అక్కడ సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కు అయినట్టుగా విజిలెన్సు వారు నిర్దారించారు. ఆ సంస్థతో లోపాయికారీ బంధం వలన.. పనులలో పురోగతి చూపించకపోయినా భారీ బిల్లులు చెల్లించినట్టుగా గుర్తించారు. బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి విశ్వాసఘాతుకానికి పాల్పడినట్టు లెక్క తేల్చారు. ఈ మేరకు విజిలెన్సు వారు తాజాగా రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఫలితంగా ఆ సంస్థను బ్లాక లిస్టులో పెట్టారు. దుర్వినియోగం అయిన సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే కేంద్ర సివిల్ సర్వీసుల నియమావళి ప్రకారం విజిలెన్సు నివేదిక ఆధారంగా ఎన్. సంజయ్ మీద ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ ను చూసుకుని ఎగిరెగిరి పడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని ఈ ఘటన నిరూపిస్తోంది. అప్పటి కీలక బాధ్యతల్లోని అనేక మంది అధికార్లకు ఇలాంటి పలితాలు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories