మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా పూర్తి మైథలాజికల్ ఫాంటెసీ మూవీగా రాబోతుంది. ఇక ఈ సినిమా నుండి రీసెంట్‌గా టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాగా దానికి మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది.
దీంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానిక మరో డైరెక్టర్ సాయం అందనుందని వార్తలు వినపడుతున్నాయి. ‘విశ్వంభర’ చిత్రాన్ని ఎలాంటి నెగెటివిటీ లేకుండా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు వివి.వినాయక్‌ను ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ను పర్యవీక్షించేందుకు చిరు రిక్వెస్ట్ చేశాడట.
వినాయక్ తన ఎక్స్‌పీరియెన్స్‌ని వినియోగించి ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ పనులను చూసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక తొలుత ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే వివి.వినాయక్ ‘విశ్వంభర’ కోసం వర్క్ చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది.