బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కి మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఆమె పాత్రలో ఎమోషన్ కూడా బాగానే హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో శ్రద్దా శ్రీనాథ్ కి మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ మోస్ట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని అందుకుంది.
అందుకే, ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతుంది. అయితే, ‘జైలర్ 2’లో శ్రద్దా శ్రీనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినపడుతుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని కూడా తెలుస్తుంది. ఇక ‘జైలర్ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకూమ్ అంటూ ‘జైలర్’లో హంగామా చేసిన రజనీకాంత్, జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాల్సిందే.