మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఒకటైన స్టాలిన్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మంచి హిట్ నే అందుకుంది. ఇప్పుడు చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సినిమాను భారీగా రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
ఈ ప్రత్యేక రీ-రిలీజ్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం అదనపు సర్ప్రైజ్ కూడా సిద్ధమైందని టాక్ వినపడుతుంది. పవన్ నటిస్తున్న తాజా సినిమా ఓజి నుండి మొదటి పాటను, అలాగే ఆయన మరో ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన గ్లింప్స్‌ను ఈ స్క్రీనింగ్స్‌కి జోడించనున్నారని సమాచారం.
అలా అంటే మెగా అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు చిరంజీవి హిట్ సినిమా మళ్లీ పెద్ద తెరపై చూడగలగడం, మరోవైపు పవన్ కొత్త సినిమాల నుంచి తాజా అప్డేట్స్ అందుకోవడం అనే రెండు సంతోషాలు కలిసిపోతున్నాయి.