అన్నా ఈ లుక్‌ ఏంది!

అన్నా ఈ లుక్‌ ఏంది! పాన్‌ ఇండియా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాల్లో క్రేజీ సీక్వెల్స్ తో పాటుగా సోలో సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా ప్రస్తుతం ది రాజా సాబ్‌, మరో పక్క దర్శకుడు హను రాఘవపూడితో భారీ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ప్రభాస్ నుంచి ఒక మెసేజ్‌ బయటకు వచ్చింది. 

డ్రగ్స్ కి సంబంధించి వచ్చిన ఈ వీడియోలో ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన సినిమాల్లో కంటే చాలా బెటర్ గా ఇంకా ఫ్రెష్ గా తాను కనిపించడంతో ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే ఇది మాత్రమే కాకుండా అప్పుడెప్పుడో సాహో కి ముందు చేసిన ఫోటో షూట్ లుక్స్ లో ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ కి తన లుక్స్ ఇపుడు స్పెషల్ గా మారాయి. 

అయితే ఇది ది రాజా సాబ్ కోసమా లేక హను రాఘవపూడి సినిమా లోనా అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇపుడు తన లుక్స్ ని పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories