బాలయ్య కోసం అనిరుధ్..ఒకటి కాదు రెండు! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి బరిలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన తరువాత సినిమా ఏంటి అనే విషయం సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.
బాలయ్య చేయబోయే తరువాత సినిమాలకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. అయితే, ఒక సినిమాకు కాకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ మూవీలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.ఇక దీంతో పాటు యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి బాలయ్య సినిమా చేయనున్నాడని.. దీనికి కూడా అనిరుధ్ సంగీతం అందించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ బాలయ్య చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడనే టాక్ వినపడుతుంది. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.