ఇప్పుడే మన టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన “తెలుసు కదా” సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తర్వాత అతడి కొత్త మాస్ ఎంటర్టైనర్ “బ్యాడాస్” కోసం మంచి ఉత్కంఠ ఇప్పటికే క్రియేట్ అయ్యింది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు వచ్చే వార్తల ప్రకారం, ఈ చిత్రానికి సంగీతాన్ని సెన్సేషనల్ దర్శకుడు అనిరుద్ రవిచందర్ అందించే అవకాశం ఉందని టాక్ బయటకు వచ్చింది. ఈ వార్త కేవలం తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, కోలీవుడ్ వర్గాల మధ్యన కూడా చర్చకు దారి తీసింది.
మేకర్స్ ఈ భారీ బజ్ ను కొనసాగిస్తూ త్వరలోనే అనిరుద్ ఖరారు విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.