ఒక్కసారిగా రెమ్యూనరేషన్‌ పెంచేసిన యానిమల్‌ బ్యూటీ!

యానిమల్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది బాలీవుడ్‌ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.  ఈ సినిమాలో రష్మిక తో పాటు నటించిన మరో హీరోయిన్‌ తృప్తి డ్రిమి. ఈ సినిమాలో రష్మిక కంటే తృప్తికే ఎక్కువ మార్కులు పడ్డాయంటే అతిశయోక్తి కాదు.

సినిమా వచ్చి చాలా రోజులు గడిచినప్పటికీ ఈ అమ్మాడి గురించి ఇంకా సోషల్ మీడియాలో ఏదోక వార్త షికారు చేస్తూనే ఉంటుంది. దాంతో సినిమా వచ్చి చాలా రోజులు గడిచినప్పటికీ ఇంకా పాప ట్రెండింగ్‌ లోనే ఉంది. దాంతో సోషల్‌ మీడియాలో తెగ క్రేజ్‌ తెచ్చేసుకుంది. దీంతో తృప్తికి ఫాలోవర్స్‌ పెరిగిపోయారు.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తృప్తి ఎప్పుడూ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్‌ చిత్రాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. యానిమల్‌ సినిమా చేస్తున్న సమయంలో తృప్తికి కేవలం 40 లక్షల రూపాయలు పారితోషంక మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఆ సినిమా సమయంలో తృప్తి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కాబట్టి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భూల్‌ భులయా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమెది స్పెసల్ రోల్‌ అని సమాచారం. అందుకు గానూ ఈ ముద్దుగుమ్మ ఏకంగా కోటి రూపాయల పారితోషకాన్ని వసూలు చేసిందంట. ఈ సినిమా కానీ హిట్‌ అయ్యి తృప్తి ఖాతాలో చేరితే మాత్రం ఆమె తరువాత సినిమాలకు కూడా కోటి రూపాయలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories