తారక్‌ సినిమాలో విలన్‌ గా యానిమల్‌ నటుడు!

యంగ్‌ డైరెక్టర్‌  తారక్‌  ”ఎన్టీఆర్‌ 31” సినిమాను యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ , సలార్‌, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీర్చిదిద్దుతుంది. ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు మూవీ బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో విలన్ గా యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాని మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా దేవర గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చారు. ఈ సినిమాను మూవీ మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories